Amitabh Bachchan : ఆ వార్తలన్నీ ఫేక్.. అమితాబ్ బచ్చన్ క్లారిటీ

X
By - Manikanta |16 March 2024 11:44 AM IST
తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తెలిపారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దీనిపై స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. కాగా నిన్న ఆయన అస్వస్థతకు గురై ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి.
వైద్యులు అమితాబ్‌కు యాంజియోప్లాస్టీ చేశారనే ప్రచారం జరిగింది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. మరోవైపు, తాజాగా ఆయన ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. ‘ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా’ అని రాసుకొచ్చారు. తన అనారోగ్యాన్ని ఉద్దేశించే ఆయన ఈ పోస్ట్ పెట్టినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com