Ananya Nagalla : కాబోయే భర్తకు గడ్డం, మీసం ఉంటే చాలు : అనన్య నాగళ్ల

Ananya Nagalla : కాబోయే భర్తకు గడ్డం, మీసం ఉంటే చాలు :  అనన్య నాగళ్ల
X

‘మల్లేషం’ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. అనంతరం పలు సినిమాల్లో ఈ అమ్మడు నటించి మెప్పించింది. వీటిలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'వకీల్ సాబ్' మూవీతో అనన్యకు మంచి గుర్తింపు వచ్చింది. అందులో ఈ బ్యూటీ ఓ కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం అమ్మడు 'పొట్టేలు' అనే సినిమాలో నటిస్తోంది.

యువచంద్ర ఇందులో హీరోగా నటిస్తున్నాడు. సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ కు సినీ అభిమానుల నుంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే అనన్య తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అతడికి హైట్, వెయిట్, అంతగా గ్లామర్ అవసరం లేదని.. ప్రపంచమంతా తిప్పాల్సిన పనిలేదని చెప్పుకొచ్చింది.

కానీ.. మంచి గడ్డం, అందమైన మీసం కట్టు ఉండాలని తెలిపింది. ఈ రెండు ఉండే వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది. రిలేషన్స్ షిప్స్ అంటే ఎప్పుడూ ఓ స్నేహంలా ఉండాలని.. అప్పుడే ఆ బంధాలు కలకాలం నిలబడతాయని తెలిపింది.

Tags

Next Story