Ananya Nagalla : అప్పుడు అభద్రత భావం ఉండేది : అనన్య నాగల్ల

'మల్లెశం' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ అనన్య నాగల్ల (Ananya Nagalla). అనంతరం 'వకీల్ సాబ్' సినిమాలో ఈ అమ్మడు అవకాశం అందుకుంది. రెండు సినిమాలు అనన్యకి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. దీంతో మరిన్ని సినిమాల్లోనూ అనన్యకు అవకాశాలు వస్తున్నాయి. తాజాగా అనన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమాల్లోకి రాకముందు మొదట్లో కొంత అభద్రతా భావం ఉండేదని చెప్పుకొచ్చింది.
తాను అందంగా లేనా? ఈ ఇండస్ట్రీకి సరిపోనా? అనిపించేదని తెలిపింది. కానీ తర్వాత ఆ ఆలోచనలు తగ్గిపోయాయని తెలిపింది. దానికి కారణం తాను చేసిన పాత్రలు కావచ్చని అభిప్రాయపడింది. దక్షిణాది పాత్రలకు ఇక్కడ అమ్మాయిలే బావుంటారని.. వారినే ప్రేక్షకులు ఆదరిస్తారని అర్థమైనట్లు చెప్పుకొచ్చింది. దాంతో ఇప్పుడు తనకు ఎలాంటి అభద్రతా భావం లేదని వెల్లడించింది. సంతోషంగా సినిమాలు చేయగల్గుతున్నానని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com