Ananya Pandey : ప్రియుడితో లైగర్ బ్యూటీ బ్రేకప్!

బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండే తమ రెండేళ్ల బంధానికి బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వారి క్లోజ్ ఫ్రెండ్ ధ్రువీకరించారు. వారిద్దరూ నెల కిందటే విడిపోయారు. ఇది మాకు షాక్ కలిగించింది. వారు జీవితంలో ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు అని పేర్కొన్నారు. ఈ జంట చివరగా అనంత్-రాధికా ప్రీవెడ్డింగ్ వేడుకకు హాజరైంది. లైగర్ మూవీతో అనన్య టాలీవుడ్‌కు పరిచయమయ్యారు.
అనన్య పాండే ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాలను చేస్తున్నారు. కంట్రోల్, శంకర చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే, కాల్ మీ బీ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. ఇక, లైగర్ చిత్రంతో తెలుగులోనూ బాగా పాపులర్ అయ్యారు అనన్య.
ఆదిత్య రాయ్ కపూర్ ప్రస్తుతం మెట్రో అన్ డైనో చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సాలీ అలీ ఖాన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, నీనా గుప్తా, ఫాతిమా సనా షేక్ కీరోల్స్ చేస్తున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com