IPL : ఐపీఎల్ మ్యాచ్‌లపై అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్

IPL : ఐపీఎల్ మ్యాచ్‌లపై అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్
X

"ఐపీఎల్ మ్యాచ్‌లు రెండు రోజులు చూడకపోతే కొంపలేం మునిగిపోవు. ఫస్ట్, సెకండ్ షో సినిమాలను చూడడానికి ప్రేక్షకులంతా థియేటర్స్ కు రండి. క్రికెట్ స్కోర్ ను మీ ఫోన్లో అయినా చూడవచ్చు" అంటూ అనిల్ రావిపూడి రీసెంట్ గా ఓ ప్రమోషన్ ఈవెంట్ లో కామెంట్స్ చేశారు. అనిల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.

సత్యదేవ్ హీరోగా అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై వి.వి గోపాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కృష్ణమ్మ. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ ఏర్పడింది. ఇక ఈ సినిమా మే 10న ప్రేక్షకులు ముందుకి రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల గ్రాండ్ లెవెల్ లో నిర్వహించారు మేకర్స్. ముఖ్య అతిథులుగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని హాజరై సందడి చేశారు. ఈ వేదికపై అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

సత్యదేవ చిన్న చిన్న పాత్రలో కెరీర్‌ ప్రారంభించి హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడనీ.. ఏ కథకైనా, ఏ పాత్రకైనా ఆయన న్యాయం చేయగలడని అన్నారు అనిల్. ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాలకు రాకపోవడంతో థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయని... ఐపీఎల్ రెండు రోజులు చూడకపోతే కొంపలేం మునిగిపోవని అనడంపై ట్రోలింగ్ జరుగుతోంది.

Tags

Next Story