Tripti Dimri : బాలీవుడ్ భామలకి షాకిస్తోన్న యానిమల్ బ్యూటీ

Tripti Dimri : బాలీవుడ్ భామలకి షాకిస్తోన్న యానిమల్ బ్యూటీ

‘యానిమల్’ సినిమాతో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి. అందులో ఘాటైన సన్నివేశాల్లో నటించి కుర్రకారు మతిని పోగొట్టింది. ఈ సినిమా భారీ హిట్ కావడంతో ఈ అమ్మడికి వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం త్రిప్తి చేతిలో ఐదారు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. 'బ్యాడ్ న్యూజ్'లో విక్కీ కౌషల్, అమ్మీ విర్క్ తో కలిసి ఈ భామ నటిస్తోంది. జూలై 19న ఈ సినిమా విడుదల కానుంది.

కాగా పలు సీక్వెల్స్ లోనూ త్రిప్తి నటిస్తూ.. జాన్వీ, కియారా లాంటి క్రేజీ భామల అవకాశాలకు గండి కొడుతోంది. కార్తీక్ ఆర్యన్ తో భూల్ భులయా 3లో కియరా అద్వాణీ నటించాల్సి ఉండగా.. అందులో త్రిప్తీని రీప్లేస్ చేశారు. జాన్వీ కపూర్ నటించిన ధడక్ సినిమాకి కూడా ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతోంది. నవంబర్ 22న ఇది థియేటర్లలోకి రానుంది.

ధడక్ లో జాన్వీ కపూర్, ఇషాన్ ఖాటర్ నటించగా, ధడక్ 2 లో త్రిప్తిడిమి సిద్ధంత్ చతుర్వేది జంటగా నటిస్తున్నారు. ఇందులో కూడా జాన్వీ నటించాల్సి ఉండగా.. ఈ అవకాశాన్ని కూడా త్రిప్తియే దక్కించుకుంది. రాజ్కుమార్ రావు 'విక్కీ విద్యా కా వోహ్ వాలా' చిత్రంలోనూ ట్రిప్తి అవకాశం అందుకుంది. కార్తీక్ ఆర్యన్తో ఆషిఖి3 లోనూ త్రిప్తి డిమ్రియో నటిస్తున్నట్లు సమాచారం.

Tags

Next Story