Tripti Dimri : వార్ 2 లో యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి

Tripti Dimri : వార్ 2 లో యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి

'యానిమల్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి. ఇందులో రణబీర్ ప్రేయసిగా నటించి సినీ అభిమానులను ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలం అయినా.. యానిమాల్ సినిమాతోనే ఓవర్ నైట్ గేమ్ ఛేంజర్గా త్రిప్తి మారిపోయింది. ఈ మూవీ అనంతరం త్రిప్తికి వరస సినిమా అవకాశాలు వస్తున్నాయి. అయితే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన ప్రాత్రల్లో నటిస్తున్న.. వార్ 2లో త్రిప్తి నటించనుందని టాక్. ఈ బ్యూటీతో హృతిక్ ఎన్టీఆర్ జోడీపై అదిరిపోయే సాంగ్ ను తెరకెక్కించనున్నారని సమాచారం. దాంతోపాటు భారీ యాక్షన్ ఎపిసోడ్స్న సైతం రూపొందిస్తారని వార్తలొస్తున్నాయి. కాకపోతే త్రిప్తిని ఎన్టీఆర్కి జోడీగా తీసుకున్నారా లేక హృతికి కి జంటగానా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక త్రిప్తి వార్ 2లో యాక్ట్ చేస్తుందన్న దానిపై ఇంకా అఫీషియల్గా అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. కాగా వార్ 2 సినిమాను యష్ రాజ్ ఫిలింస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోంది. తన అందం, అభినయంతో అభిమానులను అలరించిన త్రిప్తి.. నిజంగానే వార్ 2 లో నటిస్తే ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story