Bahiskarana Trailer : అంజలి వేశ్య పాత్ర.. బహిష్కరణ ట్రైలర్ విడుదల

Bahiskarana Trailer : అంజలి వేశ్య పాత్ర.. బహిష్కరణ ట్రైలర్ విడుదల
X

హీరోయిన్ గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో జీ 6, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్ పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ 'బహిష్కరణ', ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్లో రూపొందుతోన్న ఈ సిరీస్లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి.

ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ట్రైలర్ ను టాలీవుడ్ కింగ్ నాగార్జున విడుదల చేశారు. మంచోడు చేసే తప్పేంటో తేలుసా.. చెడ్డోడి చరిత్ర గురించి తెలుసుకోవటం అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. పచ్చటి పల్లెటూరు, అంజలి, శ్రీతేజ్, అనన్య నాగళ్ల పాత్రల మధ్య సన్నివేశాలను అందంగా చూపిస్తూనే, పల్లెటూరులో ఊరి పెద్ద, అతని మనుషులు చేసే దురాగతాలను చూపించారు. అమ్మాయిలను ఆటవస్తువులుగా చూసింది ఎవరు అనే కోణంలో స్టోరీ సాగుతుంది.

ఓ వైపు ప్రేమ కురిపిస్తూనే మరో వైపు ఆగ్రహావేశంతో ఊగిపోయే పాత్రను అంజలి పోషించింది. శ్రీతేజ్, అనన్య నాగళ్ల పాత్రలతో పాటు ఊరి పెద్ద పాత్రలో రవీంద్రన్ విజయన్ నటించారు.

Tags

Next Story