Anjali : పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తా : అంజలి

Anjali : పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తా : అంజలి
X

తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని, అయితే ఇప్పుడు పెంపుడు కుక్కతో బయటకు వెళ్లే సమయం కూడా లేదని అంజలి చెప్పారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్లలో మాట్లాడుతూ.. ‘ఇప్పటికే నాకు నాలుగైదు సార్లు పెళ్లి చేసేశారు. దీంతో ఇంట్లో వాళ్లకు వివాహ వార్తలపై నమ్మకం పోయింది. నేను ఎవరినైనా అబ్బాయిని చూపిస్తే తప్ప వారు నమ్మరు. మ్యారేజ్ లైఫ్ టైమ్ సెటిల్మెంట్. ప్రస్తుతం నటనకు మాత్రమే 100% టైం ఇవ్వగలను’ అని పేర్కొన్నారు.

మొదట్లో ఇలాంటి గాసిప్స్‌ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్లు కంగారు పడేవాళ్లు. కానీ, ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. నా పెళ్లిపై ఇప్పటి వరకు వచ్చిన గాసిప్స్‌ వల్ల నేను ఒక అబ్బాయిని తీసుకెళ్లి ‘ఇతన్నే పెళ్లి చేసుకుంటాన’ని చెప్పినా ఇంట్లో వాళ్లు నమ్మేలా లేరు. నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటా. దానికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం నేను సినిమాలతో బిజీగా ఉన్నా. తప్పకుండా నేను పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తా అని అంజలి తెలిపింది.

ప్రస్తుతం నేను కథలో పాత్రలకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తున్నాను. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నా రోల్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంది. విశ్వక్ సేన్, నేను పోటాపోటీగా నటించాం. హీరోయిన్లలో ఒకరిగా నటిస్తున్నాను. నాది ఈ చిత్రంలో బలమైన పాత్ర అంటూ కామెంట్ చేసింది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితారలో పని చేయడం సంతోషంగా ఉంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడరు. అలాంటి నిర్మాణ సంస్థ తోడు కావడం వల్లే.. ఈ సినిమా స్థాయి మరింత పెరిగింది అని అన్నారు

Tags

Next Story