Yash : యశ్ సరసన మరో బాలీవుడ్ భామ!

Yash : యశ్ సరసన మరో బాలీవుడ్ భామ!

కేజీఎఫ్ సిరీస్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న కన్నడ హీరో యశ్.. ఇప్పుడు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోంది. అయితే మొదట్లో ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్ భామ కరీనాకపూర్ పేరు పరిశీలనలో ఉన్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ తరువాత ఆ పాత్రను నయనతార దక్కించుకున్నట్లు కథనాలొచ్చాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా టాక్సిక్ లో మరో బాలీవుడ్ భామ నటించనుందని టాక్. ఓ ముఖ్య పాత్ర కోసం హ్యూమా ఖురేషీని దర్శకురాలు సంప్రదించినట్లు సమాచారం. స్టోరీ చెప్పగా.. ఆమెకు బాగా నచ్చి ఓకే కూడా చెప్పారని తెలుస్తోంది. టాక్సిక్లో హ్యూమా ఖురేషీ పాత్ర పూర్తిగా యాక్షన్ కోణంలో ఉండనున్నాయట. గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న టాక్సిక్.. 2025 ఏప్రిల్ 10న విడుదల కానుంది. కాగా కేజీఎఫ్ లాగానే టాక్సిక్ ను కూడా రెండు బాగాలుగా తీయాలని మూవీ టీం భావిస్తున్నది.

Tags

Next Story