Nagarjuna-Puri Jagannadh Combo : నాగ్-పూరీ జగన్నాథ్ కాంబోలో మరో ప్రాజెక్ట్?

సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో మరో మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రామ్ పోతినేనితో ‘డబుల్ ఇస్మార్ట్’ షూట్ తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో శివమణి, సూపర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది నా సామి రంగా సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున. అయితే ఈ సినిమా అనంతరం నాగ్ వరుస ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పటికే తమిళ నటుడు ధనుష్ – శేఖర్ కమ్ముల కాంబోలో వస్తున్న కుబేరా చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నాగ్ దీని తర్వాత నా సామి రంగ దర్శకుడు విజయ్ బిన్నితో మరో మూవీ చేయనున్నాడు.
అంతేకాదు పూరీ జగన్నాథ్ మరో సినిమాకి చర్చలు జరుపుతున్నారు. హనుమాన్`తో హిట్ కొట్టిన తేజ సజ్జాతోనూ ఓ సినిమా చేయాలని భావిస్తున్నారట. గతంలో విజయ్ దేవరకొండతో `జనగణమన సినిమాని ప్రకటించారు పూరీ. అదే స్క్రిప్ట్ ని తేజతో చేయాలనుకుంటున్నట్టు సమాచారం. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com