Anupama : రెమ్యునరేషన్ పెంచేందుకు అనుపమ వెయిటింగ్

Anupama : రెమ్యునరేషన్  పెంచేందుకు అనుపమ వెయిటింగ్

ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఆ సినిమా తరువాత సౌత్ లోని దాదాపు అన్ని భాషల్లోనూ ఈ అమ్మడు నటించింది. రీసెంట్ గా రిలీజైన టిల్లు స్క్వేర్ తో మరో విజయాన్ని కూడా అందుకుంది. ఈ మూవీలో అనుమప తన అందాలను మరింత ఎక్కువగా

ఆరబోయడంతో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఈ బ్యూటీ క్రేజ్ కూడా పెరిగింది. ఇక తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అనుపమ.. నెక్స్ట్ మూవీ విషయంలో కాస్త ఆలోచనలో పడిందట. టిల్లు స్క్వేర్ విడుదల అయిన వెంటనే ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు వచ్చాయట. కానీ వాటిని సున్నితంగా తిరస్కరించిందట. కొత్త సినిమా సైన్ చెయ్యడానికి కాస్త వేచి చూస్తోందట. అయితే ఈ వెయిటింగ్ పారితోషికం పెంచేందుకేనని ప్రచారం జరుగుతోంది. చిన్న సినిమాలో చేయడం ద్వారా భారీ పారితోషికం దక్కదనే ఉద్దేశంలో అనుపమ ఉందట. తాను అనుకున్న రెమ్యునరేషన్ వచ్చేంత వరకు కొత్త ప్రాజెక్ట్ కు సైన్ చేయకూడదనే ఆలోచనలో ఈ బ్యూటీ ఉన్నట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story