Anupama Parameswaran : రోడ్ రోలర్ తో మసాజ్.. సోషల్ మీడియాలో అనుపమ పోస్ట్

Anupama Parameswaran : రోడ్ రోలర్ తో మసాజ్..   సోషల్ మీడియాలో అనుపమ పోస్ట్
X

మళయాళం సినిమా ప్రేమమ్ తో ఇండస్ట్రీలోకి 'అడుగుపెట్టింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ( Anupama Parameswaran ). టాలీవుడ్ లోకి మాత్రం అఆ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రీసెంట్ గానే ఈ అమ్మడు నటించిన 'టిల్లు స్వేర్' సినిమా సూపర్ హిట్ అయింది. ఇందులో ఎన్నడూ లేనంతగా ఎంతో హాట్ గా కనిపించింది అనుపమ. ఈ దూకుడుతోనే త్వరలో లేడీ ఓరియెంటెడ్ సినిమా 'పరదా'తో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ బ్యూటీ.

పరదాతో తనలోని సరికొత్త టాలెంట్ను ప్రేక్షకులను చూపించనుంది. ఇక సినిమాల్లో బిజీగా ఉంటూనే.. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది అనుపమ. నిత్యం తన లేటెస్ట్ అప్ డేట్స్ ను ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు ఒక ఆసక్తికర ఫొటోను షేర్ చేసింది.

తనకు నడుము నొప్పి వస్తుందని.. అందుకు రోడ్ రోలర్ తో మసాజ్ అయితే బాగుంటుందని అర్థం వచ్చేలా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ ఫొటోకు నెటిజన్లు కూడా చాలా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక పరదా సినిమా విషయానికొస్తే.. 'సినిమా బండి' దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదొక వెరైటీ న్యూఏజ్ ట్రావెల్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్నట్లు సమాచారం.

Tags

Next Story