Anupama : "ఓ మై లిల్లీ "లో అనుపమ అందాల ఆరబోత.. కుర్రాళ్ల గుండెల్లో ఊచకోత

Anupama : ఓ మై లిల్లీ లో అనుపమ అందాల ఆరబోత.. కుర్రాళ్ల గుండెల్లో ఊచకోత

ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి రిలాక్స్ అయ్యే యూత్ ను మార్చ్ మంత్ ఎండ్ లో గిలిగింతలు పెట్టేందుకు వస్తున్న మూవీ టిల్లు స్క్వేర్ (Tillu Square). టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సిద్దు.. డీజే టిల్లు మూవీతో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టిల్లు స్క్వేర్ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి..రామ్ మిరియాల సంగీతాన్ని అందిస్తున్నారు.

మొదటి సినిమాలో సిద్దు కామెడీ పంచ్ లు హైలైట్ అయ్యాయి. ఐతే.. సీక్వెన్స్ లో అంతకుమించి హీరోయిన్ అనుపమ పరమేశ్వరనే హైలైట్ అవుతోంది. మూవీ నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ చూస్తే అనుపమ మును పెన్నడూ లేని విధంగా బోల్డ్ గా కనిపించింది. పద్ధతికి మారుపేరుగా కనిపించే అనుపమ (Anupama) ఇలా తెగించే సరికి ఆమెను ఆరాధించే యూత్ కు కూడా దిమ్మ తిరిగిపోతోంది.

అనుపమ అలా చూసిన ఫ్యాన్స్ అమ్మ బాబోయ్… నువ్వు అనుపమవేనా?అంటూ షాకింగ్ కామెంట్స్ పెడుతున్నారు. మూవీ మేకర్స్ ఈ చిత్రం నుండి ఓహ్ మై లిల్లీ అనే పాటను విడుదల చేశారు. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. అనుపమ అందాలు సినిమా ఎప్పుడెప్పుడా అని చూసేలా చేస్తున్నాయి. ఈ సినిమా మార్చి 29వ తేదీన థియేటర్లో గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది.

Tags

Read MoreRead Less
Next Story