Anupama Parameswaran : రెచ్చిపోతే అట్లుంటది.. అనుపమ చేతి నిండా సినిమాలు

మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్‌తో కెరీర్ ను మలుపుతిప్పుకుంది. గతేడాది కార్తికేయ 2 సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది. ఈ మూవీ తెలుగుతోపాటు ఇతర భాషలో రిలీజై సక్సెస్ అందుకోవడంతో క్రేజ్ మరింతగా పెరిగింది. ఇక తాజాగా ఈమె నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న టిల్లు స్క్వేర్ సినిమాతో అనుపమాకు మరింత క్రేజ్ ఏర్పడింది.
అనుపమ స్కిన్ షో ఎట్రాక్షన్ గా .. సిద్దు కామెడీ హైలైట్ గా తెరకెక్కిన ఈ మూవీ రూ.125 కోట్ల గ్రాస్ కలెక్షన్ కొల్లగొట్టింది. దీంతో... అమ్మడు మార్కెట్ ని కూడా పెరిగిపోయింది. దీంతో ఈమెకు ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనుపమ ఏకంగా ఐదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
ప్రస్తుతం హనుమన్ డైరెక్టర్స్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అక్టోపస్ వర్కింగ్ టైటిల్ తో వస్తున్న సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు బండి సరోజ్ కుమార్ డైరెక్షన్లో పరదా సినిమాలోని నటిస్తుంది. ఈ మూవీకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం తమిళ్ లో పెట్ డిటెక్టివ్ అనే సినిమాతో నటిస్తుంది. ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న సెల్వరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న బైసన్ సినిమాలోనూ ఈమె నటిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com