Anushka : మలయాళ సినిమాలో అనుష్కకు భారీ రెమ్యునరేషన్

Anushka : మలయాళ సినిమాలో అనుష్కకు భారీ రెమ్యునరేషన్

సూపర్ భామ అనుష్క (Anushka) సన్న బడింది. లేటెస్ట్ గా సన్నబడిన లుక్ తోనే మలయాళ సినిమా ఒప్పుకుంది. సోషల్ మీడియాలోనూ ఆమెకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ అంత చాలా నిరాశ చెందారు. ఆమె అధిక బరువుతో అనారోగ్యం పాలయ్యిందని.. అందుకే సినిమాలకు దూరంగా ఉంటూ కెమెరాలకు చిక్కకుండా తిరుగుతుంది అంటూ.. పలు వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే గతేడాది నవీన్ పోలిశెట్టితో కలిసి.. మిస్ శెట్టి మిస్టర్ పోలీశెట్టి సినిమాతో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చింది. ఇక తాజాగా మరో మలయాళ సినిమాకు (Malayalam Movie) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. కథనార్ ది వైల్డ్ సోర్సరర్ అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు రాజీన్ థామస్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు అనుష్క రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు అనే అంశం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా కోసం అనుష్క రూ.5 నుంచి 6 కోట్లు డిమాండ్ చేస్తునట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త నెటింట వైరల్ అవ్వడంతో.. అంత ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే మూడు ఫిలింఫేర్ అవార్డ్స్, 2 నంది అవార్డ్స్, రెండు సైమా అవార్డులను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. కొత్త లుక్ తో యంగ్ హీరోయిన్ లకు గ్లామర్ లో పోటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story