Anushka : రూ. 5 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన అనుష్క

దాదాపు 20 ఏళ్ల నుంచి టాలీవుడ్ సినిమాలు చేస్తోంది అనుష్క ( Anushka Shetty ). తన అందం, నటనతో ఇక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక బహుబలి మూవీతోనైతే ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆడపాదడపా మాత్రమే మూవీస్ చేసింది. 'సైజ్ జీరో' మూవీ చేసి మరింత డీలా పడింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా కోసం బాగా బరువు పెరిగిన అనుష్క.. తిరిగి తగ్గలేకపోయింది.
ఇక కొన్నాళ్ల నుంచి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నఅనుష్క.. గతేడాది 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో హిట్ను అందుకుంది. ప్రస్తుతం తెలుగు, మలయాళంలో ఒక్కో సినిమా చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కొన్నాళ్ల క్రితం టాలీవుడ్లో ఓ స్టార్ సరసన నటించే అవకాశం అనుష్కకు వచ్చిందట.
రూ.5 కోట్ల రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట. కానీ ఆ సినిమాలో నటించేందుకు ఈ బ్యూటీ నో చెప్పిందట. అందులో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడమే అందుకు కారణమట. దీన్ని బట్టి చూస్తే హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధ్యాన్యం ఉన్న సినిమాలోనే అనుష్క నటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com