Samantha : సమంత అభిమానుల్లో టెన్షన్

సమంత కెరీర్ లో ఎవరూ ఊహించని రీతిలో పయనిస్తున్నా.. ఆమె అభిమానులు మాత్రం కొంత టెన్షన్ పడుతున్నారు. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషీ' మూవీ తరువాత సమంత నటిస్తున్న ఒక్క సినిమా కూడా అనౌన్స్ కాలేదు. ఆమె సోషల్ మీడియా వేదికగా ఎక్స్ పోజింగ్ చేస్తూనే అనేక ఫోటో షూట్స్ ఇస్తున్నప్పటికీ కొత్త అప్ డేట్ ఏమీ రాకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.
సమంత తన పుట్టిన రోజునాడు కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటనను చూసి ఆమె అభిమానులతో పాటు చాలామంది షాక్ అయ్యారు. ఆమె 'ట్రాలాలా' పిక్చర్ పేరుతో ఆమె సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పి తన సొంత సినిమాకు 'మా ఇంటి బంగారం' అన్న టైటిల్ ఫిక్స్ చేసుకుంది. చేతిలో గన్ను పట్టుకున్న ఇల్లాలి లుక్ లో సమంత ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.
ఈ మూవీ మేకర్స్ ఎవరు అనేది ప్రశ్నగా మారింది. సమంత తానే సొంతంగా ఈ ప్రాజెక్టు చేపడుతోందా .. ఉన్న ఆస్తులు కూడా కరిగించుకుంటుందా అని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com