Arjun's Daughter : ఐశ్వర్య అర్జున్ పెళ్లి డేట్ ఫిక్స్

Arjuns Daughter : ఐశ్వర్య అర్జున్ పెళ్లి డేట్ ఫిక్స్
X

సౌత్ స్టార్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా పరిచయమై పలు సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లోనూ ఓ సినిమాలో నటించే అవకాశం దక్కినప్పటికీ.. వివిధ కారణాల రీత్యా ఆ మూవీ క్యాన్సిల్ అయింది. అయితే రీసెంట్గా ఐశ్వర్య నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు తంబి రామయ్య తనయుడు ఉమాపతి తో ఈ అమ్మడు ఎంగేజ్ మెంట్ జరిగింది. అర్జున్ స్వయంగా కట్టించిన హనుమాన్ టెంపుల్ లోనే ఈ వేడుక జరిగింది. కాగా తాజాగా ఇరు కుటుంబాలు ఉమాపతి, ఐశ్వర్య పెళ్లి తేదీలను ఖరారు చేశాయి. జూన్ 10న వీరి వివాహాన్ని నిర్వహించేందుకు సిద్ధం అయ్యాయి. అయితే నిశ్చితార్థం జరిగిన హనుమాన్ టెంపుల్ లో వీరి పెళ్లి కూడా జరగనున్నట్లు సమాచారం. కాగా అర్జున్ హోస్ట్ గా వ్యవహరించిన ఒక టీవీ కార్యక్రమంలో ఐశ్వర్య, ఉమాపతి లు పరిచయం అయ్యారు. ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లికి వీరిద్దరు సిద్దమయ్యారు. ఇక తండ్రి ఆశీస్సులతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన ఐశ్వర్య.. విశాల్ లాంటి హీరోల సరసన కొన్ని సినిమాల్లో నటించింది. అయితే ఆమెకు అనుకున్నంతగా గుర్తింపు రాకపోవడంతో.. ఒక దశలో స్వయంగా అర్జున్, కూతుర్ని పెట్టి తెలుగు-తమిళ భాషల్లో ఓ సినిమా ప్లాన్ చేశాడు. కానీ అది కార్యరూపం దాల్చలేదు.

Tags

Next Story