Tollywood : ప్రేక్షకాదరణ .. టాప్ లో ప్రభాస్, సమంత

Tollywood : ప్రేక్షకాదరణ .. టాప్ లో ప్రభాస్, సమంత
X

ఆర్మాక్స్ సంస్థ అక్టోబర్ నెలలో ప్రేక్షకాదరణ పొందిన నటీనటుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో టాప్ ప్లేస్ లో ప్రభాస్, సమంత నిలిచారు. హీరోయిన్ల కేటగిరీలో సమంత టాప్ వన్ లో నిలిచింది. ప్రభాస్ హీరోల లిస్టులో మొదటి స్థానంలో ఉన్నాడు. హీరో, హీరోయిన్లకు సంబంధించి టాప్ 10 ర్యాంకులను వెల్లడిస్తూ పోస్టర్ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. హీరోల్లో ప్రభాస్ తర్వాత విజయ్, షారూఖ్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, అజిత్ కుమార్ తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత వరసగా అల్లు అర్జున్, మహేశ్ బాబు, సూర్య, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే ఇటీవల హన్నీ బన్నీ ప్రేక్షకులను అలరించిన సమంత టాప్ ప్లేస్ లో నిలిచింది. ఆ తర్వాత ఆలియా భట్, నయనతార, దీపికా పదుకొణె, త్రిష టాప్ ఫైవ్లో చోటు దక్కించుకున్నారు. కాజల్ అగర్వాల్, శ్రద్ధాకపూర్, సాయిపల్లవి, రష్మిక, కత్రినా కైఫ్ టాప్ టెన్లో నిలిచారు.

Tags

Next Story