Ramoji Rao : రామోజీని వరించిన పురస్కారాలు ఇవే

Ramoji Rao : రామోజీని వరించిన పురస్కారాలు ఇవే
X

ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్‌సిటీని నిర్మించిన మీడియా టైకూన్ చెరుకూరి రామోజీరావు సేవలకు ఎన్నో పురస్కారాలు/ డాక్టరేట్లు వరించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం & శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం & శ్రీశ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, యుధ్వీర్ అవార్దు, కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదరి (రాజస్థాన్) అవార్డు, బి. డి. గోయెంకా అవార్డు, 2016లో సాహిత్యం, విద్య విభాగాలలో పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు.

రామోజీరావు 1974 AUG 10న నక్కవానిపాలెం(విశాఖ)లో ‘ఈనాడు’ తొలి ఆఫీస్‌ను ప్రారంభించారు. 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులకు పునాది వేశారు. 1995లో ETV ఛానల్‌ను ప్రారంభించి ‘ఈటీవీ.. మీటీవీ’ స్లోగన్‌తో ప్రతి ఇంట వినోదాన్ని పంచారు. 2003లో ETV-2 పేరిట తెలుగు రాష్ట్రాల్లో తొలి 24 గంటల వార్తా ఛానల్‌ను తీసుకొచ్చారు. దీన్ని 2014లో ETV AP, TGగా మార్చారు.

నిర్మించిన సినిమాలు

శ్రీవారికి ప్రేమలేఖ(1984), మయూరి(1985), మౌన పోరాటం(1989), ప్రతిఘటన(1987), పీపుల్స్ ఎన్‌కౌంటర్(1991), అశ్వని(1991), మెకానిక్ మామయ్య(1999), మూడుముక్కలాట (2000), చిత్రం, నువ్వే కావాలి(2000), ఇష్టం(2001), ఆనందం (2001), ఆకాశ వీధిలో(2001), నిన్ను చూడాలని(2001), తుఝె మేరీ కసమ్, వీధి(2005), నచ్చావులే(2008), నిన్ను కలిశాక(2009), దాగుడుమూత దండాకోర్(2015) వంటి 87 సినిమాలను రామోజీరావు నిర్మించారు.

Tags

Next Story