Om Bhim Bush : ఓం భీం బుష్ .. ట్రెండింగ్ లో ఆయేషా

Om Bhim Bush : ఓం భీం బుష్ సినిమాలో ఓ వ్యాంప్ తరహా పాత్రలో ఊపు ఊపేసిన బ్యూటీ ఆయేషా ఖాన్ (Ayesha Khan). కొన్ని రోజులుగా ఇన్ స్టాలో ట్రెండ్ అవుతున్న ఈ అమ్మడు ఆ సినిమాలో అందాలను ఆరబోసింది. ఆ సినిమాలో మరీ అంత ప్రాధాన్యం ఉన్న పాత్రేమీ కాకపోయినా హీరోయిన్ ప్రీతి ముకుందన్ కన్నా ఆయేషా మీదే ప్రేక్షకుల నజర్ పడింది. కారణం గ్లామరస్ గా కనిపించడమే. చేపల ఫ్రై అమ్మే అమ్మాయిగా ఆమె చేసిన క్లీవేజ్ షో కుర్రాళ్ల మతులు పోగొట్టింది.
ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో ఆయేషా చేసిన ‘మోత మోగిపోద్ది’ అనే పాటకు సంబంధించి ప్రోమో రిలీజ్ కాగా.. అందులోనూ ఆయేషా చేసిన క్లీవేజ్ షో పాట పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగించింది. దీని లిరికల్ సాంగ్ రిలీజైంది. అందులో ఆయేషా కనిపించిన ప్రతిసారీ హైలైట్ అయింది. కేవలం ఆయేషా వల్లే ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. హాట్ హాట్గా కనిపించే ఆయేషా మున్ముందు టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేలా కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com