Balagam Actor : ఆస్పత్రిలో బలగం మొగిలయ్య!

Balagam Actor : ఆస్పత్రిలో బలగం మొగిలయ్య!
X

బలగం సినిమా ఫేమ్ మొగిలయ్య తీవ్ర అస్వస్థతతో వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆయన చికిత్సకు అవసరమైన డబ్బులు లేవని, ప్రభుత్వం ఆదుకోవాలని భార్య కొమురమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడిన ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. బలగం క్లైమాక్స్‌లో ఈ దంపతులు పాడిన పాట అందరి గుండెలను పిండేసింది.

జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకత్వంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్టర్ చిత్రం ‘బ‌లగం’. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ పాట అంద‌రినీ ఏడిపించిన విష‌యం తెలిసిందే. బుడ‌గ‌జంగాల క‌ళాకారులు ప‌స్తం మొగిల‌య్య దంప‌తులు పాడిన ఈ పాట తెలంగాణ ప్ర‌జ‌ల‌ను కన్నీళ్లు పెట్టించింది

Tags

Next Story