Bharateeyudu 2 Songs : వస్తోంది భారతీయుడు 2.. పాటలు వైరల్

Bharateeyudu 2 Songs : వస్తోంది భారతీయుడు 2.. పాటలు వైరల్
X

యావద్దేశ సినీ అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా భారతీయుడు 2. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో గతంలో రూపొంది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన భారతీయుడు సినిమాకు ఇది సీక్వెల్.

'భారతీయుడు 2' మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జాయింట్ సంస్థలపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని జూలై ఒకటిన విడుదల చేయనున్నారు. జూన్ ఒకటవ తేదీన చెన్నైలో ఆడియోను విడుదల చేస్తారు. 1996లో వచ్చిన 'భారతీయుడు' అప్పట్లోనే ఓ సంచలనం. సినిమాకు సీక్వెల్ గా 'భారతీయుడు 2' ప్రకటించినప్పటినుంచీ బజ్ ఉంది.

ఈ సినిమాలో తెలుగు వెర్షన్ నుంచి సౌర అనే పాటను రిలీజ్ చేశారు. ఈ పాట అన్ని భాషల్లోనూ ట్రెండింగ్ లో ఉంది. పాటలో చూపించిన కొన్ని విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతంలో సుద్దాల అశోక్ తేజ ఈ పాటను రాశారు. రితేష్ జి.రావ్, శృతికా సముద్రాల ఆలపించారు. కమల్ హాసన్ టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ, ఎస్.జే. సూర్య అదితరులు నటించారు.

Tags

Next Story