Bheema : ఏప్రిల్ 5 నుంచి ఓటీటీలోకి గోపీచంద్ భీమా

హర్ష డైరెక్షన్‌లో గోపీచంద్ నటించిన భీమా (Bheema) సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ+హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 5 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. మార్చి 8న విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఔట్‌డేటెడ్ స్టోరీతో తెరకెక్కిన సినిమా ఇదంటూ ఆడియెన్స్ నుంచి దారుణంగా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి.
అయితే, ఓటీటీ అండ్ శాటిలైట్ హక్కులు అన్ని కలిపి మొత్తంగా రూ. 20 కోట్ల వరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.సినిమా థియేటర్స్ లో ఎండ్ టైటిల్ కార్డ్స్ లో భీమా ఓటీటీ పార్టనర్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అని ఉంది. దీంతో జిటల్ స్ట్రీమింగ్ వివరాలు బయటకి వచ్చాయి.
భీమా సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో గోపీచంద్ నటించాడు. టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ఏ హర్ష భీమా సినిమాను తెరకెక్కించాడు. కన్నడ దర్శకుడైన హర్ష భీమా మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు . ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com