Bigg Boss Season 8 : బిగ్ బాస్ సీజన్ 8 అప్ డేట్ వచ్చేసింది!

తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ షో ఎనిమిదో సీజన్ త్వరలోనే రాబోతుంది. బిగ్ బాస్ అంటే ఫ్యామిలీ లేడీస్ ఎంత ఇష్టపడుతూ ఉంటారు. ఆ గొడవలు.. ఆ అల్లర్లు.. ఆ గిల్లికజ్జాలు చాలా చాలా బాగుంటాయి అంటూ ఉంటారు జనాలు.
ఈ సీజన్ కి హోస్ట్ గా మళ్లీ అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయబోతున్నాడు. కొత్త హోస్ట్ వస్తారన్న ప్రచారానికి దాదాపు తెరపడింది. మొదటి సీజన్ కి ఎన్టీఆర్ ఆ తర్వాత సీజన్ కి నాని హోస్ట్ చేశారు. ఆ తర్వాత అన్ని సీజన్స్ కి నాగార్జున నే హోస్టింగ్ చేశారు.
బిగ్ బాస్ సీజన్ 8కి బాలకృష్ణ లేదా విజయ్ దేవరకొండ లేదా రానా దగ్గుబాటి హోస్ట్ చేయబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. ఇవన్నీ నిజాలు కావని తేలిపోయింది. కంటెస్టెంట్స్ లిస్ట్, సంప్రదింపులు పూర్తయ్యాయని.. అతి త్వరలోనే కంటెస్టెంట్స్ పై లీక్స్ రాబోతున్నాయని చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com