Birthday Wishes : రామ్ చరణ్‌కు పవన్, ఎన్టీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు (Ram Charan) జూనియర్ ఎన్టీఆర్ (NTR) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘నా సోదరుడు రామ్ చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాది నీకు సంతోషం, విజయం కలగాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. రామ్ చరణ్ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆస్కార్ పురస్కారం అందుకున్న సినిమాలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆనందాన్ని, సుఖ సంతోషాలని అందించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.
దైవభక్తి మెండుగా ఉన్న రామ్ చరణ్ ఎప్పుడు సానుకూల దృక్పధంతో ఆలోచిస్తాడు. పెద్దలు, అనుభవజ్ఞులపట్ల గౌరవమర్యాదలతో ఉంటాడు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఒక విద్యార్థిలా ఉంటాడు. ఆమె శ్రీరామ రక్షగా నిలుస్తాయి.. మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి దోహదపడతాయి. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న చరణ్.. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అంటూ పవన్ ఓ లేఖను రిలీజ్ చేశారు. అటు సినీప్రముఖులు, అభిమానులు చెర్రీకి బర్త్‌డే విషెస్ చెబుతున్నారు.
Happy birthday my brother @AlwaysRamCharan. Wishing you a year ahead filled with joy and success.
— Jr NTR (@tarak9999) March 27, 2024
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com