Prabhas : బ్లాక్‌బస్టర్‌ జోడీ.. ‍ప్రభాస్ తో నేషనల్ క్రష్

Prabhas : బ్లాక్‌బస్టర్‌ జోడీ.. ‍ప్రభాస్ తో నేషనల్ క్రష్
X

నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) చేతినిండా సినిమాలతో ఫుల్ బీజీగా ఉంది. ఇటీవలే యానిమల్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టి్ంది ఈ కన్నడ బ్యూటీ.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టా్ర్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) సరసన నటించింది. ఇప్పుడు మరో స్టార్ హీరోతో జోడీ కట్టేందుకు రష్మిక రెడీ అయిపోతుంది. యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగా స్పిరిట్‌ అనే చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఇప్పటికే వెల్లడించారు.

ఈ సినిమాలో రెబల్ స్టార్ ‍ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా రష్మికను ఎంపిక చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక వెలువడలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ వార్త మాత్రం బాగా వైరల్ అవుతోంది. అటు ఫ్యాన్స్ కూడా ఈ న్యూస్ నిజం కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే రష్మిక, ప్రభాస్ ఇప్పటివరకు వెండితెరపై కనిపించలేదు. దీంతో ఈ జంటను స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు.

ఇక స్పిరిట్‌ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 2024లో ప్రారంభిస్తామని సందీప్ రెడ్డి వెల్లడించారు. ఇందులో ప్రభాస్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. గతేడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్.. ప్రస్తుతం 'కల్కి 2898 ఏడీ' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ సమ్మర్‌లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. అటు రష్మిక.. అల్లు అర్జున్ తో పుష్ప2 షూటింగ్ లో బీజీగా ఉంది.

Tags

Next Story