Plastic Surgery Rumors : బాలీవుడ్ క్రేజీ హీరో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడా..?

ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు లుక్ మారినప్పుడు రకరకాల ప్రచారాలు వెలుగులోకి వస్తుంటాయి. కొత్తగా కనిపించినప్పుడుల్లా వీళ్ళ ప్లాస్టిక్ సర్జరీ చేపించుకుంటున్నారంటూ వార్తలు వచ్చేస్తుంటాయి. ఈ ట్రోల్స్ హీరోయిన్స్ ఎక్కువగా ఫేస్ చేస్తారు. అయితే తాజాగా ఓ నటుడు ప్లాస్టిక్ సర్జరి వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు ముఖం లేటెస్ట్ లుక్స్ లో పూర్తిగా మారిపోయింది. మొదట్లో కనిపించినదానికి ఇప్పటికీ తేడా ఉంది. దీంతో.. ఆయన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని అంటున్నారు.
ఐతే.. ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజ్ కుమార్ ఇటీవల ప్లాస్టిక్ సర్జరీలో ఎలాంటి నిజం లేదని ఈ వార్తని ఖండించారు. మేకప్ లేకుండా తీసిన ఫొటోలు వైరల్ కావడంతో ఈ చర్చ జరుగుతోందని అన్నారాయన.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com