Sundeep Kishan : హీరో సందీప్ కిషన్ హోటల్ పై కేసు

Sundeep Kishan : హీరో సందీప్ కిషన్ హోటల్ పై కేసు
X

గ్రేటర్ హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కొంతకాలంగా తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ పార్ట్‌నర్‌గా ఉన్న ‘వివాహ భోజనంబు’ హోటల్ లోనూ తనిఖీలు జరిగాయి. ఈ విషయాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు అఫిషియల్ ‘ఎక్స్’ అకౌంట్ లో బుధవారం వెల్లడించారు. సికింద్రాబాద్‌లోని వివాహ భోజనంబు హోటల్‌లో జులై 8న తనిఖీలు చేసినట్లు తెలిపారు. చిట్టి ముత్యాలు బియ్యం బ్యాగ్ ఎక్స్ పైరీ డేట్ 2022 నాటికి అయిపోయినట్లు గుర్తించారు. దీంతో పాటు 500 గ్రాముల కొబ్బరి తురుములో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపినట్లుగా తేల్చారు. ఫుడ్ ను స్టీల్ గిన్నెలో పెట్టి ఉంచారని.. వాటికి సరైన లేబుల్స్ లేవని అధికారులు తెలిపారు. కిచెన్‌లో డస్ట్ బిన్లపై మూతలు లేవని.. డ్రైన్ నీరు నిల్వ ఉండిపోయిందన్నారు. వాటికి సంబంధించిన ఫొటోల‌ను అధికారులు పోస్ట్ చేశారు. ఈ హోటల్ పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అధికారులు పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags

Next Story