Anupama Parameswaran : రొమాన్స్ సీన్లలో నటించడం అంత ఈజీ కాదు : అనుపమ

సిద్దు జొన్నల గడ్డ (Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జోడీగా డీజే టిల్లుకు సీక్వెల్ గా వస్తున్న సినిమా టిల్లు స్క్వేర్! ఈ సినిమాలో సిద్ధూతో అనుపమ చేసిన శృంగార సన్నివేశాలు చాలా మందిని ఆకర్షించాయి. ఎట్టకేలకు అనుపమ ఈ సీన్స్ పై తన మౌనాన్ని వీడింది. టిల్లు స్క్వేర్ అనుపమ పరమేశ్వరన్ లిల్లీగా నటించింది. అనుపమ పరమేశ్వరన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా టిల్లూ స్క్వేర్ సిద్ధు జొన్నలగడ్డతో నటించిన ఘాటైన సన్నివేశాలపై హోస్ట్ ప్రశ్నించారు.
కెమెరాల ముందు అంతమంది సమక్షంలో రొమాన్స్ సీన్లలో నటించడం అంత సులువు కాదంటోంది. వందమంది ముందు నటించడం చాలా కష్టం. ఆ సమయంలో పాత్రలో లీనమవుతూ, ఆడియెన్స్ ని మెప్పించాల్సి ఉంటుంది. ఇది అంత ఈజీ కాదని అంది. రొమాన్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా? అని అనుకుంటారు. కానీ అది నిజం కాదని చెప్పింది. ప్రేమమ్ లో నటించేప్పుడు నా వయసు 19. అప్పటి వయసుకు తగ్గట్టు పాత్రలు చేసాను. ఇప్పుడు నా వయస్సు 29, కాబట్టి నేను విభిన్న పాత్రలను అన్వేషించాల్సి ఉంది అని కూడా అంది.
నేను ఒకే రకమైన పాత్రలు పోషించినప్పుడు కూడా, జర్నలిస్టులు, ప్రజలు ఎందుకిలా చేసావు అనడుగుతారు. నేను లిల్లీ వంటి పాత్రలు చేసినప్పుడు, ఇలాంటి వాటిని ఎందుకు చేయాలని నిర్ణయించుకున్నావు? అని మీరే మళ్లీ అడుగుతారు. నేనేం చేయాలి? ఇంట్లోనే ఉండాలా? అంటూ ఎదురు ప్రశ్నించింది అనుపమ. మొత్తానికి ఈ ఇంటర్వ్యూ మాత్రం అనుపమకు కోపం తెప్పించిందనే చెప్పాలి. ఏది ఏమైనా ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్న టిల్లు స్క్వేర్ మూవీ ఈ నెల 29న థియేటర్లలో విడుదల కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com