Chandini Chowdary : రూట్ మార్చాల్సిందే చాందిని .. ఫ్యాన్స్ రిక్వెస్ట్

Chandini Chowdary : రూట్ మార్చాల్సిందే చాందిని .. ఫ్యాన్స్ రిక్వెస్ట్
X

కెరీర్ ప్రారంభంలో షార్ట్ ఫిలిమ్స్ చేసి అనంతరం హీరోయిన్ గా మారింది టాలీవుడ్ బ్యూటీ చాందిని చౌదరి ( Chandini Chowdary ). కేటుగాడు మూవీతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ తర్వాత కుందనపు బొమ్మ మూవీలోనూ నటించి మెప్పించింది. ఇండస్ట్రీలో తన అందం, నటనతో హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇకపోతే చాందిని చౌదరి రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కాకుండా డిఫరెంట్ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది.

ఈ ఏడాది గామి అంటూ ప్రేక్షకుల ముందుగొచ్చింది. ఈ మూవీతో మంచి సక్సెస్ ను అందుకుంది. రీసెంట్ గా యేవం, మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. ఈ రెండూ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకొచ్చినా.. మ్యూజిక్ షాప్ మూర్తి ఒక్కటే ఫీల్ గుడ్ మూవీగా టాక్ తెచ్చుకుంది.

అయితే ఇలాంటి సినిమాల విషయంలో చాందిని కమిట్మెంట్ బాగానే ఉన్నా.. ఇవి చేస్తూనే కమర్షియల్ సినిమాలు కూడా చేస్తే బాగుంటుదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాస్త రూట్ మార్చండని ఆమెకు సూచిస్తున్నారు. మరి చాందిని ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. ప్రస్తుతం సంతాన ప్రాప్తిరస్తు అనే సినిమాలో చాందిని నటిస్తోంది.

Tags

Next Story