Ruhani Sharma : మాస్క్ లో చి.ల.సౌ బ్యూటీ

Ruhani Sharma : మాస్క్ లో చి.ల.సౌ బ్యూటీ
X

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మకు ( Anushka Sharma ) దగ్గరి బంధువైన రుహానీశర్మ ( Ruhani Sharma ).. అటు బాలీవుడ్ లోనూ ఇటు సౌత్ లోనూ సినిమాలు చేస్తోంది. చి.ల.సౌ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. కడసీ బెంచ్ కార్తీక్ సినిమా ద్వారా కోలీవుడ్ కు పరిచయమైంది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో.. రుహానీకి కోలీవుడ్ లో మరో అవకాశం దక్కలేదు. కానీ దాదాపు ఏడేళ్ల తర్వాత రూహానీకి ఇప్పుడు కోలీవుడ్ మరో అవకాశం దక్కింది. కవిన్ హీరోగా తెరకెక్కుతున్న మాస్క్ మూవీలో గా చాన్స్ కొట్టేసింది. విక్రనన్ అశోక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రుహానీ హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. ఆండ్రియా ప్రధాన పాత్రలో నటిస్తున్న మాస్క్ లో.. చార్లీ, బాలసర్వం, ఆర్జే అర్చన ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నెల కిందటే ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. స్టార్ మూవీతో హిట్ అందుకున్న కవిన్.. ఇప్పుడు మాస్క్ లో ప్రేక్షకుల ముందుకొ స్తున్నాడు. డైరెక్టర్ వెట్రిమారన్ దీన్ని నిర్మిస్తుండడంతో మాస్క్ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి రుహానీ శర్మకు ఈ సినిమాతోనైనా కోలీవుడ్ కలసివస్తుందో లేదో చూడాలి.

Tags

Next Story