చిక్కుల్లో చిన్మయి.. దేశం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు

చిక్కుల్లో చిన్మయి.. దేశం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు

హీరోయిన్ తనుశ్రీ దత్త (Tanushree Dutta).. తర్వాత సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ తర్వాత అలుపెరగకుండా సింగర్ చిన్మయి (Singer Chinmayi) పోరాడుతూ వస్తోంది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై ఎప్పుడు ముందుండి పోరాడే సెలబ్రిటీలలో మొదటి లిస్టులో ఉంటుంది. తమిళ్ లెజెండ్రీ రైటర్ వైరంముత్తు తన పై లైంగికంగా వేధించాడు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసి.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జరిగిన అన్యాయాన్ని బయటపెట్టినందుకే అవకాశాలు రాకుండా పోయాయని చిన్మయి వివరించింది. తాజాగా సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఆడపిల్లలపై చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసుకుంది. ఈ వీడియోలో చిన్మయి మాటలు మన దేశాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ హెచ్ యు విద్యార్థి కుమార్ సాగర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఓ బాధ్యత గల పౌరురాలిగా ఉంటూ దేశాన్ని కించపరచడం భావ్యం కాదని.. ఆయన ఈ ఫిర్యాదులో వెల్లడించాడు. గచ్చిబౌలి పోలీసులు దీంతో అమ్మపై కేసు నమోదు చేశారు.

రీసెంట్ గా సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆడపిల్లలకు అర్థరాత్రి స్వతంత్రం ఎందుకు అంటూ మాట్లాడింది. రాత్రి 12 గంటల తర్వాత బయట వాళ్లకి ఏం పని.. అమ్మాయిలు కూడా బయట ఎక్స్పోజింగ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.. మన బట్టలు ఎదుటివారిని రెచ్చగొట్టేలా ఉంటే అచ్చంగా వారిదే తప్పు అనడంలో న్యాయం లేదు.. మనది కూడా ఎంతో కొంత తప్పు ఉంటుంది అంటూ వివరించింది. ఈ వీడియోపై చిన్నయి ఫైర్ అవుతూ తాను అన్నపూర్ణమ్మ గారికి పెద్ద ఫ్యాన్‌ అనీ.. కానీ ఒక్కోసారి మనం అభిమానించే స్టార్లే ఇలా మాట్లాడితే హార్ట్ బ్రేక్ అయినట్లు అనిపిస్తుంది అంటూ చెప్పింది. ఇలాంటి దేశంలో ఆడపిల్లలుగా పుట్టడం మన కర్మ.. ఇదొక కంట్రీనా అంటూ కామెంట్స్ చేసింది. దేశాన్ని అవహేళన చేసేలా మాట్లాడారంటూ నెటిజన్స్ ను చిన్మయి విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story