Vishwambhara Dubbing : చిరంజీవి విశ్వంభర డబ్బింగ్ షురూ

Vishwambhara Dubbing : చిరంజీవి విశ్వంభర డబ్బింగ్ షురూ
X

మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ 'విశ్వంభర' సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. షెడ్యూల్ ప్రకారం సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. తాజాగా మేకర్స్ సినిమా డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు. ఈ సినిమాలో అత్యున్నత స్థాయి వీఎఫ్ఎక్స్ ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి తగినంత సమయం పడుతుంది. దాంతో ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి.

సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, హనుమాన్ కు గొప్ప భక్తుడిగా కనిపించనున్నారు. యాక్షన్ సీక్వెన్సులు అద్భుతంగా ఉండబోతున్నాయి. దర్శకుడు వశిష్ట సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్లాక్బస్టర్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.

'విశ్వంభర' సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కునాల్ కపూర్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. 'విశ్వంభర' 2025 జనవరి 10న విడుదల కానుంది.

Tags

Next Story