RC16 : కళ్ల ముందు మళ్లీ చిరు-శ్రీదేవి.. రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కన్ఫార్మ్

తెలుగు సినిమా ఉన్నంతకాలం గుర్తుండిపోయే పెయిర్ చిరంజీవి-శ్రీదేవి. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో వీరిద్దరి జంట ఎవర్ గ్రీన్ హిట్ పెయిర్ అనిపించుకుంది. వీరిద్దరి నెక్స్ట్ జెనరేషన్ రామ్ చరణ్, జాన్వీ కపూర్. వీళ్లిద్దరూ కలిసి నటిస్తే చూడాలని చాలామంది కలలు కంటున్నారు. ఆ కల నెరవేరబోతోంది.
జాన్వీ కపూర్ కు సొగసులోనూ.. స్ట్రక్టర్ లోనూ తిరుగులేదు. బాలీవుడ్‌లో బాడీ లెక్కలను రీవ్యాంప్ చేసి తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతోంది జాన్వీకపూర్. ఆమె టాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది. ఎన్టీఆర్ తో దేవరలోనూ నటిస్తోంది. దేవర పార్ట్-1 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది జాన్వీ.
ఉప్పెన సినిమా ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆర్‌సీ 16 అనే వర్కింగ్ టైటిల్‌తో ఇది ప్రచారంలో ఉంది. ఈ మూవీలో జాన్వీ నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. జాన్వీ కపూర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రాజెక్టులోకి స్వాగతం అంటూ ఆర్‌సీ 16 మూవీ టీమ్ పోస్టు పెట్టింది. కాగా.. జాన్వీ కపూర్ తెలుగులో నటిస్తోన్న రెండో సినిమా ఇది. RRR హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇద్దరికీ జాన్వీ బ్లాక్ బస్టర్ ఇస్తుందా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com