Vishwambhara : విశ్వంభరలో చిరు సాంగ్ రీమిక్స్?
తెలుగు తెరపై చిరంజీవి కెరీర్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చేదే. ఆయన పాటలు, ఫైట్లు.. ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంటాయి. మాస్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించిన ఘనత సాధించుకున్న హీరో చిరంజీవి. కమర్షియల్ సినిమాలు తీయడంలో చిరంజీవిని మించిన హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆయన వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు.
సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కుతోంది కాబట్టి ఇందులో కొన్ని కీలకమైన ఎపిసోడ్స్ ని చిత్రీకరించాల్సి ఉంటుంది. నార్మల్ కమర్షియల్ సినిమా అయితే రెగ్యులర్ సాంగ్స్, ఫైట్స్ తో నడుస్తూ ఉంటుంది. కాబట్టి అవి చేయడం చాలా ఈజీ కానీ సోషయో ఫాంటసీ మూవీలో గ్రాఫిక్స్ కి పెద్ద పీట వేస్తూనే చాలా ఎక్కువ వర్క్ అయితే ఉంటుంది. చిరంజీవి, రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చేసిన “జగదేకవీరుడు అతిలోకసుందరి” సినిమాలోని ‘ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా’ అనే సాంగ్ లోని ఒక ట్రాక్ ను విశ్వంభర సినిమా కోసం రీమిక్స్ చేసి వాడబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. చిరంజీవి త్రిష కాంబినేషన్ లో స్టాలిన్ అనే సినిమా వచ్చింది. ప్రియతమ సాంగ్ లో చిరంజీవి, త్రిష మళ్లీ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com