CM Fadnavis Reacts : సైఫ్ అలీఖాన్‌కు కత్తిపోట్లపై సీఎం ఫడ్నవీస్ రియాక్షన్

X
By - Manikanta |17 Jan 2025 12:15 PM IST
సంచలనం రేపుతున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మీద కత్తి పోట్ల కేసుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రియాక్టయ్యారు. దాడి ఘటనపై పోలీసులు విచారిస్తున్నారని, వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నారని తెలిపారు. ఈ ఘటన ఆధారంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. దేశంలోని మెగా సిటీల్లో ముంబై అత్యంత సురక్షితమైన నగరమన్నారు. ముంబైలో ఇటీవలి కాలంలో కొన్ని దుర్ఘటనలు జరిగిన విషయం వాస్తవమేనని... వాటిని తాము కూడా అంతే తీవ్ర ఘటనలుగా భావించి విచారిస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనల ఆధారంగా ముంబై సురక్షితం కాదని ప్రతిపక్షాలు అనడం సరికాదన్నారు. ముంబై ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించవద్దని సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com