Sapthagiri Mother : కమెడియన్ సప్తగిరి తల్లి కన్నుమూత

Sapthagiri Mother : కమెడియన్ సప్తగిరి తల్లి కన్నుమూత
X

ప్రముఖ కమెడియన్, హీరో సప్తగిరి ఇంట్లో విషాదం నెలకొంది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి చిట్టెమ్మ నిన్న రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇవాళ తిరుపతిలో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. దీంతో తోటి నటీనటులు సంతాపం తెలుపుతున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన సప్తగిరి.. ఆ తర్వాత కమెడియన్ తనదైన ముద్ర వేశారు. హీరోగానూ రాణిస్తున్నారు. ఇటీవల 'పెళ్లికాని ప్రసాద్' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఇతడు నటించిన కన్నప్ప.. విడుదల కావాల్సి ఉంది.

సప్తగిరి ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి. అతని అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. తర్వాత తన పేరును సప్తగిరి అని మార్చుకున్నాడు. అతని స్వస్థలం చిత్తూరు జిల్లా, పుంగనూరు. తండ్రి అటవీ శాఖలో ఉద్యోగి. ఇంటర్ వరకు చదివాడు. తరువాత ఎంసెట్ లో మంచి ర్యాంకు రాలేదు. ఇంటర్ పరీక్షలయ్యాక ఒక రోజు తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాడు. అక్కడ ఓ సాధువు రూపంలో కనిపించిన వ్యక్తి ఇతన్ని సప్తగిరి అని సంబోధించడంతో అదెందుకో బాగుందనిపించి తరువాత తన పేరును సప్తగిరి అని మార్చుకున్నాడు

Tags

Next Story