Prabhas PRO : హీరో ప్రభాస్ పీఆర్వోపై ఫిర్యాదు

సినీ హీరో ప్రభాస్ పీఆర్డీఓపై విజయ్ సాధు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్-44లో విజయ్ సాధు ఓ యూట్యూబ్ చానల్ పనిచేస్తున్నాడు. ఈ నెల 4న హీరో ప్రభాస్ కు మేజర్ సర్జరీ జరిగిందంటూ ఓ వీడియోను విజయసాధు పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. ప్రభాస్ పీఆర్వో సురేష్ కొండి యూట్యూబ్ లో పెట్టిన పోస్టుకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించడంతో పాటు వెంటనే డిలీట్ చేయాలని బెదిరిస్తూ అసభ్య పదజాలంతో దూషించాడని విజయ్ సాధు పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. ఈ నెల 6వ తేదీన ఉదయం 10 మంది యువకులు తాము ప్రభాస్ అభిమానులం అంటూ న్యూసెన్స్ చేయగా భయాందోళనకు గురైన విజయ్ సాధు డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని పంపించి వేశారు. గొడవకు కారణమైన సురేష్ కొండిపై చర్యలు తీసుకోవాలంటూ విజయ్ సాధు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com