Tamannah : పాఠ్యాంశంగా తమన్నా జీవితం.. తీవ్ర విమర్శలు

Tamannah : పాఠ్యాంశంగా తమన్నా జీవితం.. తీవ్ర విమర్శలు
X

బెంగళూరులోని హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల 7వ తరగతి పుస్తకాల్లో నటి తమన్నా, రణ్‌వీర్ సింగ్‌ల గురించి పాఠ్యాంశాన్ని చేర్చడంపై వివాదం నెలకొంది. సింధీ వర్గంలో ఎంతోమంది కళాకారులున్నారని, సినిమాల్లో అర్ధ నగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఫైర్ అయ్యారు.

అయితే సింధీ వర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించడంతోనే ఇలా చేశామని యాజమాన్యం అంటోంది. విద్యార్థుల తల్లిదండ్రులను యాజమాన్యం బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. కాగా విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించ‌క‌పోవ‌డంతో కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ను ఆశ్రయించారు.

ఇక తెలుగులో శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తమన్నా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి ఫేమ్ తెచ్చుకుంది. తన 20 ఏళ్ల కెరీర్‌లో 80కి పైగా చిత్రాల్లో నటించింది. పలు వెబ్ సిరీస్, టెలివిజన్ షోలు, అలాగే మ్యూజిక్ ఆల్బమ్స్‌లో మెప్పించింది. ఇటీవల రిలీజైన లస్ట్ స్టోరీస్ 2 ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం వీడా, స్త్రీ 2, ఓదెల రైల్వే స్టేషన్ 2 సినిమాల్లో నటిస్తున్నది.

Tags

Next Story