Samyuktha Menon : కేరళ బ్యూటీకి క్రేజీ ఆఫర్

Samyuktha Menon : కేరళ బ్యూటీకి క్రేజీ ఆఫర్
X

బీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడికి పరిచయమైన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్. అనంతరం బింబిసార మూవీతో సినీ అభిమానులను ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఇక డెవిల్ లోనూ తన అందం, అభినయంతో అలరించింది. టాలీవుడ్ లో ఆమె చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్ కావడంతో.. ఇక్కడ క్రేజీ హీరోయిన్గా సంయుక్త మారిపోయింది. యంగ్ హీరోలకు ఈ భామ మొదటి ఛాయిస్ నిలిచింది. ప్రస్తుతం శర్వానంద్, నిఖిల్ లాంటి యంగ్ హీరోలతో ఈ బ్యూటీ నటిస్తోంది. తాజాగా మరో యంగ్ హీరో సినిమాలో సంయుక్త చాన్స్ కొట్టేసినట్లు టాక్. బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి మూవీలో హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం. ఛత్రపతి హిందీ రీమేక్ అంతగా ఆకట్టుకోకపోవడంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి.. ఇప్పుడు టైసన్ నాయుడు మూవీలో బెల్లంకొండ నటిస్తున్నాడు. దీంతో పాటు మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అందులో లుధీర్ బైరెడ్డి అనే కొత్త దర్శకుడు ఓ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఇందులో సంయుక్త హీరోయిన్గా నటించనున్నట్లు తెలుస్తోంది. రూ. 50 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Tags

Next Story