RC16 Update : డేట్ ఫిక్స్.. షూటింగ్ కు RC16 రెడీ

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న RC16 సినిమా టైటిల్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందని ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చేసింది. అంతేకాదు, ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈనెల 20న పూజా కార్యక్రమంతో సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్లు తెలిపాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనున్నారు.
ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనుంది. దీన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.
గతేడాది చరణ్ బర్త్ డే రోజే ఈ మూవీని అనౌన్స్ చేశారు. ఆ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే అప్పటి నుంచీ ఎలాంటి అప్డేట్ లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com