Deepika Padukone : తల్లి కాబోతున్న దీపికా పదుకొణె

X
By - Manikanta |29 Feb 2024 12:00 PM IST
బాలీవుడ్ మోస్ట్ లవ్‌డ్ కపుల్ దీపికా పదుకొణె (Deepika Padukone) , రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ శుభవార్తను దీపికా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. వచ్చే సెప్టెంబర్ లో తాను బిడ్డకు జన్మనివ్వనున్నట్లుగా దీపికా తన పోస్టులో తెలిపింది. చిన్నారి దుస్తులతో, చెప్పులతో, బొమ్మలతో డిజైన్ చేసిన ఓ పోస్టర్ ని తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ జంట. దీంతో దీపికా , రణ్‌వీర్ సింగ్ లకు అభిమానులతో పాటుగా సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా వీరిద్దరూ 2018లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం దీపికా ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898ఏడీలో హీరోయిన్ గా నటిస్తుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com