Deepika Padukone : బేబీ బంప్ తో దీపిక పదుకొనె.. ఫోటోలు వైరల్

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె ( Deepika Padukone ) బేబీ బంప్తో కనిపించింది. నిన్న ముంబై వేదికగా జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ సంగీత్ కార్యక్రమానికి దీపిక హాజరయ్యారు. ఈ సందర్భంగా పర్పుల్ కలర్ శారీ ధరించిన దీపిక బేబీ బంప్తో కనిపించింది. రీసెంట్గానే కల్కి 2898 ఏడీ ప్రెస్ మీట్లో దీపికా పదుకొనె బేబీ బంప్ తో కనిపించడమే కాదు.. ప్రెగ్నెన్సీ కళ మొహంలో కొట్టొచ్చినట్టుగా కనిపించింది. అయితే ఆఈవెంట్ లో దీపికా పదుకొనెహై హీల్స్ వేసుకోవడంపైనా అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఇక దీపికా డెలివరీ టైమ్ దగ్గర పడుతుండటంతో ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది. బేబీ బంప్తో దీపికా పదుకొనె డిజైనర్ శారీలో చేయించుకున్న ఫోటో ఇప్పుడు వైరల్గా మారింది. పర్పుల్ కలర్ డిజైనర్ శారీలోమెడలో సింపుల్గా ముత్యాల చోకర్ తో దీపికాపదుకొనె బేబీ బంప్ ఫోటోషూట్ చూసి ఆమెఅభిమానులుమురిసిపోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com