Devara : 'దేవర' ఆయుధ పూజ.. ఫ్యాన్స్ కు రోమాలు నిక్కబొడిచే అప్ డేట్

Devara : దేవర ఆయుధ పూజ.. ఫ్యాన్స్ కు రోమాలు నిక్కబొడిచే అప్ డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది.

ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఎంతో కసితో తెరకెక్కిస్తున్న సినిమా దేవర. ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పై విజువల్స్.. వండర్ క్రియేట్ చేస్తాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా టాకీ పార్ట్‌ షూటింగ్ అంత పూర్తయిందని.. కీలకమైన యాక్షన్స్ సన్నివేశాలు అన్ని ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది.

సినిమాలో విలన్స్ ని భయంకరంగా హతమార్చే సన్నివేశానికి ముందు.. వచ్చే ఆయుధ పూజ సాంగ్ దేవర కి హైలెట్ అంటున్నారు. అనిరుధ్ ఈ సాంగ్ ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ షూటింగ్ కు మేకర్స్ సిద్ధమవుతున్నారట. ప్రస్తుతం సాంగ్ షూటింగ్ కోసం సెట్ వర్క్స్ జరుగుతున్నాయని.. సరికొత్త అనుభూతి ఇచ్చే విధంగా ఈ పాట షూటింగ్ జరగబోతుందని తెలుస్తోంది. హై వోల్టేజ్ ఎలివేషన్ తో గూస్ బంప్స్ క్రియేట్ చేసే విధంగా విజువల్స్ ఉండబోతున్నాయట. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్టు ఇప్పటికే కొరటాల ప్రకటించాడు. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. ఎంతో వండర్ఫుల్ విజువల్స్ తో తెరకెక్కుతున్న అయుధ్ధ పూజా సాంగ్ ధియేటర్లలో బ్లాస్ట్ అవడం ఖాయం అంటూ తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story