Devara 1st Single : దేవర ఫస్ట్ సింగిల్.. దాన్ని మించేలా..!!

ప్యాన్ ఇండియా మూవీ దేవరపై అంతటా బజ్ క్రియేట్ అయి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవరకు మరో బిజినెస్ కిక్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఇప్పటికే దేవర సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.
RRRతో హిందీ ఆడియన్స్ ను మెప్పించిన ఎన్టీఆర్ మరోసారి నార్త్ బెల్ట్ ను ఆకట్టుకోవడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచేసింది. కాబట్టి ఇప్పుడు మే 19వ తేదీన ఫస్ట్ సింగిల్ గా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్టుగా సినిమా యూనిట్ అనౌన్స్ చేసింది.
అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్షన్ లో దేవర పాటలు వస్తున్నాయి. మొదటగా రిలీజయ్యే పాట.. జైలర్ సినిమాలో వచ్చిన ‘హుకుం ‘ అనే సాంగ్ ను మించి ఉండబోతుందనే వార్తలైతే ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com