Varalaskhmi Sharath Kumar : డబ్బు చూసి అతడిని ప్రేమించలేదు: వరలక్ష్మీ శరత్‌కుమర్

తన పెళ్లి విషయంలో వస్తున్న ట్రోలింగ్‌పై హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌కుమర్ స్పందించారు. ‘నేను నికోలయ్ సచ్‌దేవ్‌ను డబ్బు కోసం పెళ్లి చేసుకోవడం లేదు. నా సంపాదనతో నేను చాలా సంతోషంగా ఉన్నా. అలాంటప్పుడు నేను డబ్బు కోసం ఎందుకు పెళ్లి చేసుకుంటా. నికోలయ్ తన మొదటి భార్యతో కలిసి ఉన్నప్పటి నుంచే ఆయనతో పరిచయం ఉంది. ఆయన ప్రవర్తన, మర్యాద చూసి నాకు ప్రేమ కలిగింది. నా కళ్లకు ఆయన ఎప్పుడూ హీరోనే’ అని ఆమె చెప్పారు.
కాబోయే భర్త నికోలయ్ సచ్‌దేవ్‌పై వచ్చిన విమర్శలపై నటి వరలక్ష్మీ శరత్ కుమార్ స్పందించారు. సెకండ్ మ్యారేజ్ అంటూ నిక్ గురించి కొందరు మాట్లాడుతున్న మాటలను తాను పట్టించుకోనని చెప్పారు. 14 ఏళ్ల క్రితం సచ్‌దేవ్‌ను కలిశానని తెలిపారు. తమ స్నేహం ఈ మధ్య కాలంలోనే ప్రేమగా మారిందన్నారు. ఇటీవల ఈ జంట నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు కాలేదని ఆమె వెల్లడించారు.
వరలక్ష్మీ శరత్ కుమార్ చాలా తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు ఆమె. భాషతో సంబంధం లేకుండా ఆఫర్స్ అందుకోవడం ఆమె స్పెషాలిటీ. నిజానికి చాలా కాలంగా ఆమె ఇండస్ట్రీలో ఉన్నప్పటికే సపోర్టింగ్ రోల్స్ చేయడంతో చాలా పాపులర్ అయ్యారు వరలక్ష్మీ శరత్‌కుమార్. తెలుగులో కూడా వరుస విజయాలు అందుకున్నారు. క్రాక్, నాంది, వీరసింహా రెడ్డి, కోటబొమ్మాళి పీఎస్, హనుమాన్ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com