Devara Digital Rights : 'దేవర' జాతర.. డిజిటల్ రైట్స్‌కే దిమ్మతిరిగే రేటు

Devara Digital Rights : దేవర జాతర.. డిజిటల్ రైట్స్‌కే దిమ్మతిరిగే రేటు

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాకు ప్యాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉంది. మూవీ క్లిప్స్ చూసిన బాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డిజిటల్ కంపెనీలు భారీ రేట్లకు కొన్ని హక్కులు దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. ఎన్టీఆర్, కొరటాల శివలది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కావడంతో.. కొత్త సినిమాపైనా భారీ అంచనాలు ఉన్నాయి.

RRR తర్వాత ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న తారక్ సినిమా దేవర. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్‌ కూడా ఈ మూవీకి బాలీవుడ్ లో ఓ స్పెషల్ ఎట్రాక్షన్. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది. ఫస్ట్ పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొద్ది నెలలు మాత్రమే గడువు ఉండడంతో సినిమా పనులను మెల్లమెల్లగా టీం పూర్తి చేస్తున్నారు.

దేవర నార్త్ ఇండియా డిజిటల్ ఆడియో హక్కులను భారీ రేటుకు ప్రముఖ సంస్థ కొనుగోలు చేసింది. మూవీ మ్యూజిక్ హక్కులను టి సిరీస్ సంస్థ దక్కించుకున్నట్టు తెలిసింది. డిజిటల్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుందని యూనిట్ తెలిపింది. ఇందుకోసం నెట్ ఫ్లిక్స్.. రూ.155 కోట్లు పెట్టినట్టు టాక్. ఇది టోటల్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story