Family Star : దిల్ రాజు భార్య నోట 'ఫ్యామిలీ స్టార్' ఫస్ట్ రివ్యూ
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ (Family Star) కోసం జనం ఎదురుచూస్తున్నారు. గీతగోవిందం తర్వాత దర్శకుడు పరుశురామ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన రెండో సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మ్యాజిక్ ఉంది. అది రిపీట్ అవుతుందని ఫ్యామిలీ ఆడియన్స్ ఆశిస్తున్నారు.
ఫ్యామిలీ మూవీస్ కు కేరాఫ్ గా నిలిచారు దిల్ రాజు. సోదరుడు శిరీష్ తో కలిసి ఈ మూవీని నిర్మించారు దిల్ రాజు. అమెరికాలో మూవీ ప్రీమియర్ షోలు గురువారమే పడుతున్నాయి. హైదరాబాద్‌లో మీడియా వాళ్ళకి, తమ ఫ్యామిలీకి కూడా సాయంత్రం సినిమా చూపించడానికి మేకర్స్ సిద్ధం అయ్యారు. విజయ్ దేవరకొండ, దిల్ రాజు ఫ్యామిలీలు సినిమాను ముందే చూశాయి. అలా దిల్ రాజు భార్య, విజయ్ దేవరకొండ తండ్రి ఈ సినిమా గురించి ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. ఫ్యామిలీ స్టార్ సినిమా చూశాక తన భార్య తేజస్విని హిట్ కొట్టేసారండి.. అని కాంప్లిమెంట్ ఇచ్చినట్లు నిర్మాత దిల్ రాజు వివరించాడు.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఆమె వచ్చిందని.. ఆమె జడ్జిమెంట్ పర్ఫెక్ట్, క్రెడిబుల్ గా ఉంటుందని దిల్ రాజు చెప్పాడు. క్రెడిబుల్ రివ్యూ ఇస్తుందని చెప్పుకొచ్చాడు. దిల్ రాజు కూతురు బలగం నిర్మాతల్లో ఒకరైన హన్షిత రెడ్డి సినిమాను చూసి విజయ్ దేవరకొండ కిల్డ్ ఇట్ అంటూ హగ్ చేసుకుందని.. ఆయన వివరించాడు. విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ ఈ సినిమా దిల్ రాజు బయోపిక్ లా ఉందని చెప్పుకొచ్చాడట. ఫ్యామిలీ స్టార్ సినిమాను చూసి ఎంటర్టైన్మెంట్ మూవీలో చాలా నచ్చిందని యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ చెప్పాడు. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ల పర్సనల్ లైఫ్ ను బాగా టచ్ చేస్తుందని మూవీ టీమ్ మెంబర్స్ చెబుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com